'Saptagiri LLB' Movie Shooting in Switzerland

స్విట్జర్లాండ్లో 'సప్తగిరి ఎల్ఎల్బి
కామెడీ కింగ్సప్తగిరి కథానాయకుడిగా సప్తగిరి ఎక్స్ప్రెస్వంటి సూపర్హిట్చిత్రాన్ని నిర్మించిన సాయి సెల్యులాయిడ్సినిమాటిక్క్రియేషన్స్ప్రై లిమిటెడ్అధినేత డా.రవికిరణ్మళ్లీ సప్తగిరి హీరోగా 'సప్తగిరి ఎల్ఎల్బి' చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. హిందీలో సూపర్డూపర్హిట్అయిన 'జాలీ ఎల్‌.ఎల్‌.బి' పార్ట్‌-1ని 'సప్తగిరి ఎల్ఎల్బి'గా తెలుగులో రీమేక్చేస్తున్నారు. చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ సెప్టెంబర్‌ 22 నుంచి స్విట్జర్లాండ్లో జరుగుతోంది
సందర్భంగా నిర్మాత డా. రవికిరణ్మాట్లాడుతూ ''ఈనెల 22 స్విట్జర్లాండ్లో పాటల చిత్రీకరణ ప్రారంభించాం. అక్టోబర్‌ 5 వరకు జరిగే షెడ్యూల్లో 3 పాటలను చిత్రీకరిస్తార. దీంతో టోటల్గా షూటింగ్పూర్తవుతుంది. పోస్ట్ప్రొడక్షన్వర్క్కంప్లీట్చేసి అక్టోబర్చివరి వారంలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఎక్కడా కాంప్రమైజ్అవకుండా పాటల్ని స్విట్జర్లాండ్లో తీస్తున్నాం. హిందీలో సూపర్హిట్అయిన 'జాలీ ఎల్ఎల్బి' పార్ట్‌ 1 రీమేక్గా చిత్రాన్ని నిర్మిస్తున్నాం. తెలుగులో కూడా సినిమా పెద్ద హిట్అవుతుంది. 'సప్తగిరి ఎల్ఎల్బి' హీరో సప్తగిరికి, మా బేనర్కి మరో సూపర్హిట్సినిమా అవుతుంది'' అన్నారు

కామెడీ కింగ్సప్తగిరి సరసన కశిష్వోరా హీరోయిన్గా నటిస్తున్న చిత్రానికి మాటలు: పరుచూరి బ్రదర్స్‌, సంగీతం: విజయ్బుల్గానిన్‌, కో-డైరెక్టర్‌: రాజశేఖర్రెడ్డి పులిచెర్ల, ఫొటోగ్రఫీ: సారంగం ఎస్‌.ఆర్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: అర్జున్‌, పాటలు: చంద్రబోస్‌, కందికొండ, ప్రొడక్షన్ఎగ్జిక్యూటివ్‌: భిక్షపతి తుమ్మల, నిర్మాత: డా. రవికిరణ్‌, దర్శకత్వం: చరణ్లక్కాకుల













Previous
Next Post »