Marlapuli movie Stills






వరుణ్ సందేశ్ ప్రత్యక పాత్రలో అర్చన వేద ,పోసాని కృష్ణ మురళి ,ముఖ్య పాత్రలో సుధాకర్ IMPECS INDIA PVT LTD పతాకం పై భవాని శంకర్ బి.సుధాకర్ రెడ్డి ఐ యస్.దినకర్ రెడ్డి సంయుక్తంగా డి.రామకృష్ణ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం మర్లపులి.ఇటీవలే సైరా నరసింహరెడ్డి సంస్థా కార్యాలయంలో చిత్ర దర్శకులు సురేందర్ రెడ్డి తియట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసారు,ఈ సందర్భంగా సురేందర్ రెడ్డి మాట్లాడ్తూ తియట్రికల్ ట్రైలర్ చూసాను చాలా బాగుంది ఈ చిత్రాని మన తెలుగు ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు.ఈ చిత్ర దర్శకుడు రామకృష్ణకు వాల టీం కు అల్ ది బెస్ట్ అని అన్నారు.ఈ సందర్భంగా వాకడ అప్పారావు మాట్లాడుతూ చిత్ర దర్శకుడు రామకృష్ణ మంచి ప్రతిభ ఉన్న యువకుడు,మా సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థాలో సహాయ దర్శకుడిగా చాలా సినిమాలకి పని చేసాడు తియట్రికల్ ట్రైలర్ చూసాను చాలా బాగుంది.ఈ చిత్రంలో కొత్తధనం చాలా ఉంది.అన్ని వర్గాలకి ఈ చిత్రం నచ్చుతుంది,మర్లపులి టీం కు అల్ ది బెస్ట్ అన్నారు.చిత్ర దర్శకుడు డి.రామకృష్ణ మాట్లాడుతూ స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు మా మూవీ మర్లపులి తియట్రికల్ ట్రైలర్ లాంచ్ చేసినందుకు నేనెపుడు మర్చిపోను,యువ దర్శకులకు ఆయన ఎంతో మందికి ఆదర్శం మా నిర్మాతలు ఈ చిత్రాన్ని ఎక్కడ కంప్రోమిసే అవకుండ నిర్మిస్తున్నారు.అర్చన వేద క్యారెక్టర్ చాలా కొత్తగా వుంటుంది.చాల రోజుల తరువాత మంచి నటనకు స్కోప్ ఉన్న పాత్రని పోషించారు.ఈ చిత్రంతో నటిగా మంచి గుర్తింపు వస్తుంది.వరుణ్ సందేశ్ క్యారెక్టర్ మర్లపులి చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.పోసాని మురళి కృష్ణ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది అని అన్నారు.
ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ అర్చన వేద,పోసాని మురళి కృష్ణ,తాగుబోతు రమేష్,భాను శ్రీ , చంమక్ చంద్ర , రమణారెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్ సదానందం అండ్ కిషోర్. సంగీతం బి ఎస్ రెడ్డి , కెమెరా ఏం మురళి కృష్ణ.
నిర్మాతలు భవాని శంకర్ ,బి.సుధాకర్ రెడ్డి , ఐ ఎస్ దినకర్ రెడ్డి , రచన దర్శకత్వం డి రామకృష్ణ.


Previous
Next Post »