సూపర్‌స్టార్ రజనీకాంత్, గ్రేట్
డైరెక్టర్ శంకర్
కాంబినేషన్లో
వచ్చిన
'రోబో'
ప్రపంచ
వ్యాప్తంగా సంచలనం
సృష్టించింది. మళ్ళీ
ఇదే
కాంబినేషన్లో
రోబో
చిత్రానికి సీక్వెల్గా
రూపొందుతున్న చిత్రం
'2.0'. ఈ
చిత్రానికి సంబంధించిన 3డి
మేకింగ్ వీడియో
శనివారం విడుదల
చేశారు.
ఈ
సందర్భంగా లైకా
ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్
రాజు
మహాలింగం మాట్లాడుతూ - ''రజనీకాంత్గారితో
శంకర్గారు చేస్తున్న మరో
అద్భుతమైన చిత్రమిది. ఇండియన్ సినిమాలోనే భారీ
బడ్జెట్తో,
హై
టెక్నికల్ వాల్యూస్‌తో
హాలీవుడ్ స్థాయిలో ఈ
చిత్ర
నిర్మాణం జరుగుతోంది. ఈ
చిత్రానికి సంబంధించిన 3డి
మేకింగ్ వీడియోను ఈరోజు
విడుదల
చేశాం.
ఈనెల
27న
దుబాయ్లో ఈ చిత్రం
ఆడియోను చాలా
గ్రాండ్గా
రిలీజ్
చేయబోతున్నాం. ప్రస్తుతం ఈ
చిత్రానికి సంబంధించిన పోస్ట్
ప్రొడక్షన్ వర్క్
జరుగుతోంది. జనవరి
25న
ప్రపంచ
వ్యాప్తంగా ఈ
చిత్రాన్ని విడుదల
చేయడానికి ప్లాన్
చేశాం''
అన్నారు.
సూపర్‌స్టార్ రజనీకాంత్ సరసన
ఎమీ
జాక్సన్ హీరోయిన్గా
నటిస్తున్న ఈ
చిత్రంలో బాలీవుడ్ స్టార్
అక్షయ్‌కుమార్ విలన్‌గా
ఒక
ప్రత్యేక పాత్ర
పోషిస్తున్నారు. ఇంకా
ఈ
చిత్రంలో సుధాంశు పాండే,
ఆదిల్
హుసేన్,
కళాభవన్ షాజాన్,
రియాజ్
ఖాన్
ఇతర
పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ
చిత్రానికి సినిమాటోగ్రఫీ: నిరవ్షా, సంగీతం: ఎ.ఆర్.రెహమాన్, ఎడిటింగ్: ఆంటోని,
సమర్పణ:
సుభాష్
కరణ్,
లైకా
ప్రొడక్షన్స్ క్రియేటివ్ హెడ్:
రాజు
మహాలింగం, నిర్మాణం: లైకా
ప్రొడక్షన్స్, కథ,
స్క్రీన్ప్లే,
దర్శకత్వం: శంకర్.
ConversionConversion EmoticonEmoticon