పవర్‌స్టార్ స్ఫూర్తితో..
ప్రశ్నిద్దాం
సమాజంలో నెలకొన్న
సమస్యలను
ఎత్తిచూపుతూ పవర్
స్టార్ పవన్
కళ్యాణ్ అభిమానులు సినిమాస్త్రాన్ని సంధిస్తున్నారు. 'ప్రశ్నిద్దాం' పేరుతో సినిమాను తెరకెక్కించబోతున్నట్టు
దర్శకుడు
బద్రీనాయుడు అబ్బు
తెలిపారు. పవర్
స్టార్ అభిమానులే చిత్రయూనిట్గా
పవన్
కళ్యాణ్ గారి
స్ఫూర్తితో ఈ
సినిమా చేస్తున్నట్టు
తెలిపారు. కేవలం
మూడు పాత్రలతోనే,
అతి తక్కువ
రోజుల్లోనే ఈ
సినిమాను తెరకెక్కిస్తూ వినూత్నమైన
ప్రయోగానికి తెరలేపుతున్నట్టు ఆయన
ప్రకటించారు.
సమాజ సమస్యలను
ఎత్తి చూపుతూ 'ప్రశ్నిద్దాం'.. ఇది మన హక్కు అంటూ
ఈ సినిమా కథనం
సాగుతుందని
చిత్రయూనిట్ తెలిపింది. చంద్రబోస్ సేవా
సమితి సమర్పణలో
శ్రీవెంకటేశ
సాయి ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్పై
దాసరి నరసింహ,
యార్లగడ్డ
లక్ష్మి సంయుక్త నిర్మాణంలో ఈ
సినిమా తెరకెక్కబోతోంది. నటీనటుల
వివరాలు ప్రకటించి
త్వరలోనే
ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా వినూత్న రీతిలో జరపబోతున్నట్టు చిత్రయూనిట్
తెలిపింది.
·
శ్రీవెంకటేశ సాయి ఆర్ట్ క్రియేషన్స్
·
సమర్పణ: చంద్రబోస్ సేవా సమితి
·
మ్యూజిక్: శ్రీనివాస్ మాలపాటి
·
దర్శకుడు: బద్రీనాయుడు అబ్బు
·
నిర్మాతలు: దాసరి నరసింహ, యార్లగడ్డ లక్ష్మి
ConversionConversion EmoticonEmoticon