అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో అప్పూ - ది క్రేజీ బాయ్





అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో అప్పూ - ది క్రేజీ బాయ్


నవంబర్‌ 8 నుంచి 14 వరకూ హైదరాబాద్లో జరగనున్న అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవంలో ప్రదర్శనకుఅప్పూఎంపికైంది. చిన్నారుల చిన్ని చిన్ని కోరికలను తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తే ఏమౌతుంది? పసి వయసులో తల్లిదండ్రుల నుంచి పిల్లలు ఏం కోరుకుంటారు? అనే సందేశంతో రూపొందిన చిత్రమిది. ది క్రేజీ బాయ్‌.. అనేది ఉపశీర్షిక. మాస్టర్సాయి శ్రీవంత్టైటిల్రోల్లో మోహన్మూవీ మేకర్స్పతాకంపై స్వీయ దర్శకత్వంలో మోహన్నిర్మించిన సినిమాలో జాకీ, లోహిత్కుమార్, పూజ, బిందు, జ్వాలా చక్రవర్తి, దిలీప్ రాథోడ్ ప్రధాన తారాగణం. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన స్క్రిప్ట్తో రూపొందిన సినిమా కావడం విశేషం
సందర్భంగా దర్శకనిర్మాత కె. మోహన్మాట్లాడుతూ – ‘‘ఎనిమిదేళ్ల అప్పూకి ఏనుగును చూడాలని కోరిక. అతని తల్లిదండ్రులకు చూపించే తీరిక ఉండదు. ఎవరి ఉద్యోగాల్లో వాళ్లు బిజీ. అప్పుడు అప్పూ ఏం చేశాడనేది చిత్రకథ. అప్పూగా సాయి శ్రీవంత్అద్భుతంగా నటించాడు. చిన్నారులతో పాటు తల్లిదండ్రులు అందరూ చూడాల్సిన చిత్రమిది’’ అన్నారు
బాలలు సుమిత్జాషు, సాయి అభిషేక్, లాస్య, మనోజ్ఞ, ఆదా, చిరుహాస్, సద్దాంలు ఇందులో కీలక పాత్రల్లో నటించారు.


Previous
Next Post »