నేను కిడ్నాప్ అయ్యాను

`నేను కిడ్నాప్ అయ్యాను` చిత్రం శుక్రవారం విడుదలై మంచి రెస్పాన్స్ రావడం తో చిత్ర యూనిట్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెప్పడానికి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సందర్బంగా..
నిర్మాత మాధవి మాట్లాడుతూ ``దర్శకుడు శ్రీకర్ చెప్పిన కథ నచ్చి సినిమా చేశాం. తను ఫెంటాస్టిక్ డైరెక్టర్. చెప్పినట్టు తీయడం తో సినిమా మంచి విజయం సాధించింది. సినిమా చూస్తున్న రెండుగంటలు హ్యాపీ గా నవ్వుకుంటున్నారు. సినిమా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్‌`` అన్నారు.
ర్శకుడు శ్రీకర్ బాబు మాట్లాడుతూ ``మా సినిమా చూసి ఆదరించిన ప్రతి ప్రేక్షకునికి ధన్యవాదాలు తెలియచేస్తున్నా. అక్టోబర్ 6 విడుదలైన నేను కిడ్నాప్ అయ్యాను` చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తున్నందుకు ఆనందం గా ఉంది. తనకు తెలియకుండానే కిడ్నాప్ అయితే ఎలా ఉంటుందో అనే సైకాలాజికల్ కిడ్నాప్ బేస్డ్ స్టోరీ. సినిమా అన్నీ వర్గాల ప్రేక్షుకులు అలరిస్తుంది`` అన్నారు
హీరోయిన్ బిందు మాట్లాడుతూ ``మంచి సినిమాలో భాగం అయినందుకు సంతోషంగా ఉంది, పూర్తి కామెడీ ని పంచిన మా చిత్రాన్ని మరింత సపోర్ట్ చేయాలని ప్రేక్షుకులను కోరుతున్నా`` అన్నారు.
కొరియో గ్రాఫర్ జో జో మాట్లాడుతూ ``హెల్తీ కామెడీ, రెగ్యులర్ జోనర్ కాకుండా డిఫరెంట్ గా ప్లాన్ చేసిన చిత్రాన్ని సక్సెస్ చేసిన ప్రేక్షుకులకు నా కృతజ్ఞతలు`` అన్నారు.

డిస్ట్రిబ్యూటర్ సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ``వైజాగ్ ప్రాంతం లో కలెక్షన్స్ బాగొస్తున్నాయి. ఇంకా పెరిగే అవకాశం ఉంది, సినిమాను అందరూ ఆదరిస్తున్నారు, నాకు చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతకు నా కృతజ్ఞతలు`` అని తెలియచేసారు

Previous
Next Post »