Anchor Ravi's "Idhi Naa Prema Katha" Release Postponed Due to Technical Reasons !!

టెక్నికల్ ఇష్యూస్ కారణంగా "ఇది నా ప్రేమకథ" విడుదల వాయిదా 
యాంకర్ రవి హీరోగా పరిచమవుతూ నటిస్తున్న చిత్రం "ఇది మా ప్రేమ కథ". పాపులర్ యాంకర్ రవి సరసన "శశిరేఖా పరిణయం" సీరియల్ ఫేమ్ మేఘన లోకేష్ కథానాయికగా నటిస్తున్న చిత్రాన్ని మత్స్య క్రియేషన్స్-పి.ఎల్.కె ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మస్తున్నాయి. అయోధ్య కార్తీక్ దర్శకుడిగా పరిచయమవుతుండగా.. కార్తీక్ కొడకండ్ల సంగీత సారధ్యం వహిస్తున్నారు. డిసెంబర్ 8 చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేసినప్పటికీ టెక్నికల్ రీజన్స్ వల్ల చిత్రాన్ని వాయిదా వేశారు.  
సందర్భంగా చిత్ర నిర్మాత పి.ఎల్.కె.రెడ్డి మాట్లాడుతూ..  "పాపులర్ యాంకర్ రవి హీరోగా పరిచయమవుతూ నటించిన చిత్రం "ఇది నా ప్రేమకథ". ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా రూపొందిన చిత్రాన్ని డిసెంబర్ 8 విడుదల చేద్దామనుకొన్నాం. కానీ.. టెక్నికల్ ఇష్యూస్ కారణంగా విడుదల వాయిదా వేయడం జరిగింది. అన్నారుడేట్ .
దత్వరలోనే ప్రకటిస్తాం" అన్నారు
దర్శకుడు అయోధ్య కార్తీక్ మాట్లాడుతూ.. "ప్రేక్షకులకు ఒక మంచి సినిమా చూశామన్న అనుభూతిని కలిగించడం కోసం చేస్తున్న కృషి వల్లనే సినిమా విడుదల వేయడం జరిగింది. సినిమా తప్పకుండా అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందన్న నమ్మకం ఉంది" అన్నారు.

చిత్రానికి పబ్లిసిటీ డిజైన్స్: రమేష్ కొత్తపల్లి, పాటలు: దినేష్ (నాని), సినిమాటోగ్రఫీ: మోహన్ రెడ్డి, సంగీతం: కార్తీక్ కొడకండ్ల, నిర్మాణం: మత్స్య క్రియేషన్స్-పి.ఎల్.కె.క్రియేషన్స్, నిర్మాత: పి.ఎల్.కె.రెడ్డి, దర్శకత్వం: అయోధ్య కార్తీక్!






Previous
Next Post »