సూపర్‌స్టార్ మహేష్ 'స్పైడర్' సెన్సార్ పూర్తి - సెప్టెంబర్ 27 విడుదల
సూపర్‌స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ కాంబినేషన్లో
ఠాగూర్
మధు
సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా
ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న భారీ
చిత్రం
'స్పెడర్'. తెలుగు,
తమిళ
భాషల్లో రూపొందిన ఈ
చిత్రం
సెన్సార్ పూర్తి
చేసుకొని సింగిల్ కట్
లేకుండా యు/ఎ సర్టిఫికెట్ పొందింది. అన్ని
కార్యక్రమాలు పూర్తి
చేసుకొని దసరా
కానుగా
సెప్టెంబర్ 27న
తెలుగు,
తమిళ
భాషల్లో ప్రపంచ
వ్యాప్తంగా విడుదలవుతోంది. హేరిస్
జయరాజ్
సారధ్యంలో రూపొందిన ఈ
ఆడియో
ఇటీవల
విడుదలై సూపర్
సక్సెస్ అయింది.
సూపర్‌స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ ఫస్ట్
కాంబినేషన్లో
రూపొందిన 'స్పైడర్' ట్రైలర్కు
ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ
అంచనాలు ఏర్పడ్డాయి. ఆ
అంచనాలను అందుకునే స్థాయిలో టెక్నికల్గా
హై
స్టాండర్డ్స్లో,
భారీ
బడ్జెట్తో
రూపొందిన ఈ
చిత్రం
సూపర్‌స్టార్ మహేష్ కెరీర్లో మరో బిగ్గెస్ట్ హిట్
అవుతుందన్న కాన్ఫిడెన్స్తో
వున్నారు దర్శకనిర్మాతలు.
సూపర్‌స్టార్ మహేష్, రకుల్‌ప్రీత్ సింగ్, ఎస్.జె.సూర్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ
చిత్రానికి సంగీతం:
హేరిస్
జయరాజ్,
సినిమాటోగ్రఫీ: సంతోష్
శివన్
ఎఎస్సి.ఐఎస్సి,
ఎడిటింగ్: శ్రీకర్ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: రూపిన్
సుచక్,
ఫైట్స్:
పీటర్
హెయిన్,
సమర్పణ:
ఠాగూర్
మధు,
నిర్మాత: ఎన్.వి.ప్రసాద్, కథ,
స్క్రీన్ప్లే,
దర్శకత్వం: ఎ.ఆర్.మురుగదాస్.
ConversionConversion EmoticonEmoticon