Gulabi Meda Audio Release



'గులాబీ మేడ' ఆడియో ఆవిష్కరణ
అల్లు వంశీ, అక్షర జంటగా ఎల్‌.వి. క్రియేటివ్ఎంటర్టైన్మెంట్స్పతాకంపై బొండా వెంకటస్వామి నాయుడు దర్శకత్వంలో లెంకల అశోక్రెడ్డి నిర్మిస్తున్న లవ్అండ్హార్రర్ఎంటర్టైనర్‌ 'గులాబీ మేడ'. చిత్రం షూటింగ్పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ప్రొడక్షన్వర్క్జరుపుకుంటోంది. కాగా, చిత్రం ఆడియో ఆవిష్కరణ సోమవారం హైదరాబాద్లోని ప్రసాద్ల్యాబ్లో పలువురు సినీ ప్రముఖుల నడుమ ఘనంగా జరిగింది. కార్యక్రమంలో ప్రముఖ నటి కవిత, తెలంగాణ ఫిలిం ఛాంబర్ఆఫ్కామర్స్అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణగౌడ్‌, తెలంగాణ ఫిలిం ఛాంబర్ఆఫ్కామర్స్‌, సెక్రటరీ సాయి వెంకట్‌, నిర్మాత మోహన్గౌడ్‌, దర్శకుడు నల్లపూసలు బాబ్జీ, చిత్ర దర్శకుడు బొండా వెంకటస్వామినాయుడు, చిత్ర నిర్మాత లెంకల అశోక్రెడ్డి, లెంకల సత్యనారాయణరెడ్డి, ఆర్‌.పి., సంగీత దర్శకుడు సాకేత్నాయుడు, డాన్స్మాస్టర్సూర్యకిరణ్రేలంగి, ఆర్‌.కె.బాబాయ్‌, రాజనాల రాజేంద్రప్రసాద్తదితరులు పాల్గొన్నారు. బిగ్సీడీని ప్రతాని రామకృష్ణగౌడ్ఆవిష్కరించగా, ఆడియో సీడీని కవిత విడుదల చేశారు.
సందర్భంగా కవిత మాట్లాడుతూ - ''రొమాన్స్‌, హార్రర్‌, థ్రిల్లింగ్ఎలిమెంట్స్తో రూపొందిన సినిమా డెఫినెట్గా సక్సెస్అవుతుంది. పాటలు, ట్రైలర్స్చాలా బాగున్నాయి. సినిమా సక్సెస్అయితే నిర్మాత అశోక్రెడ్డిగారు మరిన్ని చిత్రాలు నిర్మిస్తారు. కొత్తవాళ్ళు ఇండస్ట్రీకి ఎంతోమంది రావాలి. వస్తేనే ఇండస్ట్రీ కళకళలాడుతుంది'' అన్నారు.
ప్రతాని రామకృష్ణగౌడ్మాట్లాడుతూ - ''గతంలో గులాబి టైటిల్తో వచ్చిన చిత్రాలన్నీ చాలా పెద్ద హిట్అయ్యాయి. గులాబీమేడ కూడా పెద్ద సక్సెస్అవుతుందన్న నమ్మకం వుంది. లవ్హార్రర్కథాంశంతో వచ్చిన సినిమాలన్నీ సూపర్హిట్అయ్యాయి. సినిమా కూడా పెద్ద హిట్అవుతుంది. దసరా నుంచి చిన్న సినిమాల కోసం 5 షోకు సంబంధించిన జి.వో.ను ప్రభుత్వం విడుదల చేసింది. చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు. కంటెంట్బాగుంటే చిన్న సినిమానే పెద్ద బ్లాక్బస్టర్హిట్అవుతుందని ఈమధ్య విడుదలైన చాలా చిన్న సినిమాలు నిరూపించాయి. సినిమా రిలీజ్విషయంలో ఆంధ్ర, తెలంగాణలలో అత్యధిక థియేటర్స్ఇప్పించేందుకు నావంతు సహకారాన్ని అందిస్తాను'' అన్నారు.
సాయివెంకట్మాట్లాడుతూ - ''డైరెక్టర్వెంకటస్వామినాయుడు ఎంతో ప్యాషన్తో సినిమాని రూపొందించారు. నిర్మాత అశోక్రెడ్డిగారికి సెల్ఫ్కాన్ఫిడెన్స్ఎక్కువ. అది వున్న నిర్మాత తప్పకుండా సక్సెస్అవుతారు. సినిమాలో దమ్ముంటే పెద్ద హిట్అవుతుంది. గులాబీమేడలోని సాంగ్స్‌, ట్రైలర్స్చూస్తుంటే సినిమాలో మంచి కంటెంట్వుందనిపిస్తోంది. సినిమా హిట్అయి నిర్మాత అశోక్రెడ్డిగారికి మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
దర్శకుడు బొండా వెంకటస్వామినాయుడు మాట్లాడుతూ - ''అశోక్రెడ్డిగారు, నేను ఒక మంచి సినిమా చెయ్యాలని ఎప్పటినుంచో ప్లాన్చేసుకున్నాం. ఒక మంచి కథ కుదరడంతో గులాబీమేడ చిత్రాన్ని రూపొందించాం. లవ్‌, హార్రర్థ్రిల్లింగ్ఎలిమెంట్స్తో చిత్రాన్ని చేశాం. అశోక్రెడ్డిగారు ఒక ముఖ్యమైన క్యారెక్టర్చేశారు. తప్పకుండా సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను'' అన్నారు.
నిర్మాత అశోక్రెడ్డి మాట్లాడుతూ - ''దర్శకుడు వెంకటస్వామినాయుడు 10 సంవత్సరాలుగా పరిచయం. మొదట చిన్న సినిమా తీసి ప్రూవ్చేసుకోవాలని సినిమా నిర్మించడం జరిగింది. చిన్న సినిమాగా స్టార్ట్అయినా పెద్ద సినిమా స్థాయిలోనే చిత్రాన్ని తియ్యడం జరిగింది. నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిత్రం షూటింగ్చేశాం. సినిమా పూర్తవడానికి నా మిత్రులు ఎంతో మంది సహకారాన్ని అందించారు. అక్టోబర్లో సినిమాని విడుదల చేయడానికి ప్లాన్చేస్తున్నాం'' అన్నారు.
సంగీత దర్శకుడు సాకేత్నాయుడు మాట్లాడుతూ - ''సంగీత దర్శకుడుగా ఇది నాకు ఐదో సినిమా. చిత్రంలో నాలుగు పాటలు వున్నాయి. ఒక్కో పాట ఒక్కో కాన్సెప్ట్తో వుంటుంది. దర్శకుడు వెంకటస్వామినాయుడుగారు నాకు ఎంతో ఫ్రీడమ్ఇచ్చారు. ఇదొక క్రైమ్థ్రిల్లర్మూవీ. రీ-రికార్డింగ్చాలా బాగా వచ్చింది. తప్పకుండా సినిమా సక్సెస్అవుతుంది. అవకాశం ఇచ్చిన నిర్మాత అశోక్రెడ్డిగారికి థాంక్స్‌'' అన్నారు




Previous
Next Post »