వీరభద్ర క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 2 నూతన చిత్రం ప్రారంభం
కొత్త నటుడు శ్రీకాంత్ హీరోగా, హేమలత (బుజ్జి) నాయికగా వీరభద్ర క్రియేషన్స్ కొత్త చిత్రాన్ని హైదరాబాద్లో బుధవారం ప్రారంభించింది. హేమలతా రెడ్డి నిర్మాత. కె.గోవర్ధన్రావు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ముహూర్తపు సన్నివేశానికి మల్టీ డైమన్షన్స్ వాసు క్లాప్కొట్టారు. మల్కాపురం శివకుమార్, `సరోవరం` నిర్మాత శ్రీలత కలిసి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ స్క్రిప్ట్ను అందజేశారు. అయోధ్యకుమార్ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో
నిర్మాత మాట్లాడుతూ ``ఈ నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. 50-60 రోజులు రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. త్వరలో నే చిత్రాన్నివిడుదల చేస్తాం. వీరభద్ర క్రియేషన్స్ సంస్థలో మేం నిర్మిస్తున్న రెండో సినిమా ఇది. ఆల్రెడీ ఒక సినిమా పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది`` అని అన్నారు.
భానుచందర్ మాట్లాడుతూ ``నాకు మంచి రోల్ ఇచ్చారు. నేను అతిథిగా కాకుండా, పూర్తి లెంగ్త్ ఉన్న పాత్ర చేస్తున్నాను. హేమలత చాలా బాగా నిర్మిస్తున్నారు. ఈ అమ్మాయికి నేను సపోర్ట్ చేస్తాను`` అని తెలిపారు.
దర్శకుడు మాట్లాడుతూ ``అమలాపురంలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి ఆంధ్రా, తెలంగాణలో 50-60రోజులు షూటింగ్ చేస్తాం. సుమన్గారు, భానుచందర్గారు మాకు చాలా సహాయం చేస్తున్నారు. మా ప్రాజెక్ట్ తప్పకుండా హిట్ అవుతుంది. నిర్మాతగారు చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు`` అని చెప్పారు.
భాను చందర్, సుమన్ , సన , కాశీ విశ్వనాధ్ , రజిత , విద్య లతా , నిహాల్ , వేణు , మహేష్ , ఫణి , రమణ్ , వెన్నెల కిశోర్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాత : హేమలత రెడ్డి , స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కె గోవర్ధన్ రావు, సంగీతం : రమణ్ రాథోడ్ , ఫోటోగ్రఫీ : ప్రసాద్ ఈదర (శంకర్ కుమార్ ), ఎడిటింగ్ : నాగిరెడ్డి వి , మాటలు : కరణ్ గోపిని , కథ : వీరభద్ర క్రియేషన్స్.
ConversionConversion EmoticonEmoticon