కొంచెం దిల్ ఉంటే చాలు నూతన చిత్ర ప్రారంభోత్సవం

కొంచెం దిల్ ఉంటే చాలు నూతన చిత్ర ప్రారంభోత్సవం

త్రిరాస్ ప్రణామ్ ఆర్ట్స్ బ్యానర్ పై రాజేష్ పత్తి, శ్వేతా హీరో హీరోయిన్స్ గా  అమృత శ్రీరామ్ దర్శక నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం కొంచెం దిల్ ఉంటే చాలు నూతన చిత్ర ప్రారంబోత్సవం   సోమవారం ఫిల్మ్ ఛాంబర్లో పూజా కార్యక్రమాలతో జరుపుకుంది. నూతన చిత్రానికి మారుదూరి రాజా క్లాప్  నివ్వగా, సురేష్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా, గౌరవ దర్శకత్వం డా. మారుతి సకారం అందించారు. అనంతరం మారుదూరి రాజా  మాట్లాడుతూ హారర్, కామెడీ, థ్రిల్లర్ బేస్డ్ స్టోరీ అని విన్నాను. ఇప్పుడొస్తున్న కొత్త వారందరు మంచి టాలెంట్ తో కమిట్మెంట్  తో వస్తున్నారు. వీరందరూ విజయం సాధించాలని, సినిమా ప్రతి ఒక్కరి మెప్పు పొందుతుందని ఆశిస్తున్నాను అన్నారు. హీరో రాజేష్ మాట్లాడుతూ మంచి రోల్ ప్లే చేస్తున్నా, సినిమా పూర్తయ్యి రిలీజ్ వరకు వెళ్లాలని కోరుతున్నా, నాకు చిత్రంలో అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతకు నా కృతఙ్ఞతలు అని అన్నారు. హీరోయిన్ శ్వేతా మాట్లాడుతూ  కొంచెం దిల్ ఉంటే చాలు మంచి సబ్జెక్ట్. చిత్రం లో ట్రెడిషనల్ ఉన్న పాత్రలో నటిస్తున్నాను. మంచి రోల్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తున్న దర్శక నిర్మాతకు నా థాంక్స్ అన్నారు. చిత్రం లో 5 పాటలుంటాయి. మెలోడీ, మాస్ బిట్స్ కూడా ఉన్నాయి. అన్నీ పాటలు సందర్భానుచితంగా ఉండనున్నాయి. విజువల్ గా కూడా అద్భుతంగా ఉన్నాయంటూ  సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ తెలిపారు. కెమెరా మెన్ సాగర్ మాట్లాడుతూ నన్ను నమ్మి అవకాశం ఇచ్చినందుకు కృతఙ్ఞతలు. విజువల్ బేస్డ్ మూవీ అవుతుందని నమ్ముతున్నా అన్నారు. ఇక దర్శక నిర్మాత శ్రీరామ్ మాట్లాడుతూ నిన్ను చూడగానే చిత్రం తరువాత చేస్తున్న కొత్త సినిమా కొంచెం దిల్ ఉంటే చాలు. ఈవివి గారి చిత్రం లా ఎంటర్టైన్ చేసేలా మా చిత్రం ఉండబోతోంది. కామెడీ, హార్రర్, థ్రిల్లర్ మరియు లవ్ కలగలిపిన చిత్రం కొంచెం దిల్ ఉంటే చాలు. ఇందులో ఇద్దరు హీరోలు ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు. కేవలం 18 మంది ఆర్టిస్టులతోనే కథ మొత్తం తిరుగుతుంది. నవంబర్ 15 నుంచి రెగ్యులర్ షూట్ ప్రారంభించి త్వరగా ముగించి శివరాత్రి పండుగకు విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. చిత్రానికి అన్నివిధాలా సహాయ సహకారాలు అందించిన బొదాసు నరసింహ గారికి మా కృతఙ్ఞతలు అని తెలియచేసారు.

రాజేష్, శ్వేతా , డా. మారుతి సకారం, బొదాసు నరసింహ , జీవన్ తదితరులు నటిస్తున్న చిత్రానికి నిర్మాత: అమృత పురి శ్రీరామ్, కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం: శ్రీరామ్, కెమెరా: మోసస్ సాగర్, సంగీతం: రాజ్ కిరణ్.









Previous
Next Post »